Junior NTR : గేమ్ షో లో వ్యక్తిగత విషయాలను పంచుకున్న ఎన్టీఆర్

* ఓ గేమ్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ ఒక ఎపిసోడ్ లో తన వ్యక్తిగత విషయాలను పంచుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.

admin1
Updated on: 1 Sept 2021 4:30 PM IST
Junior NTR Shares His Personal Matters in Television Game Show
X

జూనియర్ ఎన్టీఆర్ (ట్విట్టర్ ఫోటో) 

Junior NTR : ఒకవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోవైపు రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గర అవుతున్నారు. తాజాగా ఇప్పుడు "ఎవరు మీలో కోటీశ్వరుడు" అనే గేమ్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ ఒక ఎపిసోడ్ లో తన వ్యక్తిగత విషయాలను పంచుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా విడుదలైన ఇవాల్టి ఎపిసోడ్ ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక కంటెస్టెంట్ తో మాట్లాడుతూ "వన్ డే బ్యాచిలర్" అంటే పెళ్లికి క్వాలిఫికేషన్ అది" అని ఎన్టీఆర్ అనగా ఆ కంటెస్టెంట్ లేనిపోని థాట్స్ క్రియేట్ చేయొద్దు సార్ అంటూ నవ్వేశారు.

అయితే ఎన్టీఆర్ "మీకు జుట్టు ప్రాబ్లం అయితే నాకు కొవ్వు ప్రాబ్లం. చాలా లావుగా ఉండే వాడిని. అసహ్యంగా ఉన్నావు అని చాలామంది అనేవారు" అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ "రాఖీ" సినిమా వరకు బొద్దుగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ "యమదొంగ" సినిమాతో తన మేక్ఓవర్ తో అందరికీ షాక్ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లోనే ఫిట్గా ఉండే హీరోలలో ఒకరు. అసలే టి ఆర్ పి ఎక్కువగా రాని "ఎవరు మీలో కోటీశ్వరుడు" షో లో ఎన్టీఆర్ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉండడంతో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.

admin1

admin1

Next Story