Junior NTR: "ఎవరు మీలో కోటీశ్వరుడు" షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్

Evaru Meelo Koteeswarulu: 2000సంవత్సరంలో బుల్లితెరలో మొదలైన "కౌన్ బనేగా కరోడ్ పతి" షో ఎంతో మందిని లక్షాధికారులను చేసింది..

Sandeep Reddy
Published on: 10 July 2021 5:53 PM IST
Junior NTR Joins in Evaru Meelo Koteeswarulu 2021 Shooting
X

జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో) 

Junior NTR: 2000సంవత్సరంలో బుల్లితెరలో మొదలైన "కౌన్ బనేగా కరోడ్ పతి" షో ఎంతో మందిని లక్షాధికారులను చేసింది.. కొంతమందిని కోటీశ్వరులను చేసింది. తమకున్న తెలివితేటలతో షోలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి గెలుచుకున్న డబ్బుతో ఎందరి జీవితాలనో మార్చింది ఆ షో. అందుకేనేమో అమితాబ్ బచ్చన్ తో మొదలైన "కౌన్ బనేగా కరోడ్ పతి" దిగ్విజయంగా 12 సీజన్లు నిర్వహించారు. ఆ తర్వాత తెలుగులో "మీలో ఎవరు కోటీశ్వరుడు"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షోని తెలుగు ప్రజలు కూడా బాగానే ఆదరించారు. కింగ్ నాగార్జున హోస్ట్ గా మొదలైన ఈ షోలో మెగా స్టార్ చిరంజీవి వంటి టాప్ హీరోలు హోస్ట్ గా వ్యవహరించారు.

చిరంజీవి తర్వాత ఆ షో ప్రసారం ముగియడంతో మరో ప్రముఖ ఛానల్ లో "ఎవరు మీలో కోటీశ్వరుడు" పేరుతో ప్రారంభం కానున్న మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ రియాలిటీ షో సంబంధించిన షూటింగ్ శనివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది. దాదాపుగా 10 రోజుల పాటు జరగనున్న ఈ రియాలిటీ షో షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. అటు హీరోగా కాకుండా వ్యాఖ్యతగా కూడా ఎన్టీఆర్ బుల్లితెర పైన తన మార్క్ చూపించాడు. మరోపక్క రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా రెండు పాటలు మినహా దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి చేసుకోవడంతో కాస్త ఖాళీ దొరకగానే ఈ రియాలిటీ షో షూటింగ్ ని మొదలుపెట్టేశాడు జూనియర్.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story