కొరటాల కు కండిషన్ పెట్టిన ఎన్టీఆర్

Junior NTR Giving Advice to Koratala Siva | Tollywood News
x

కొరటాల కు కండిషన్ పెట్టిన ఎన్టీఆర్

Highlights

కొరటాల కు కండిషన్ పెట్టిన ఎన్టీఆర్

Jr NTR: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమా ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. బోలెడన్ని అంచనాల మధ్య విడుదలైనప్పటికి ఈ సినిమా వాటిని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ నేపథ్యంలో కొరటాల శివ తన ఫోకస్ మొత్తం తన తదుపరి సినిమా పైనే పెట్టారు.

తాజాగా కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ పతాకంపై కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ చిత్ర డైలాగ్ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది.

ఐదు భాషల్లో ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇంకా జరుగుతున్నాయి. అయితే దర్శకుడు కొరటాల శివకు హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ కండీషన్ పెట్టారట. మళ్లీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండమని కొరటాల కు ఎన్టీఆర్ చెబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ కొరటాల కు ఈ కండిషన్ పెట్టినట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories