Junior NTR: కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోబోతున్న ఎన్టీఆర్

* అన్ని కమిట్మెంట్ లని వాయిదా వేసిన ఎన్టీఆర్

admin1
Updated on: 13 Nov 2021 3:30 PM IST
Junior NTR Decided to Take Rest For Few Weeks From Movie Shootings
X

 కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోబోతున్న ఎన్టీఆర్

Junior NTR: ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకుందామని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారట. ఎన్టీఆర్ చేతి వేలుకి ఒక చిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే సర్జరీ వల్ల మాత్రమే కాక ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" షూటింగ్ షెడ్యూల్స్ తో బాగా అలిసిపోయారు. దీంతో పాటు షూటింగులకు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నారు తారక్. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తన మేనేజర్తో కమిట్మెంట్ లన్నిటిని వాయిదా వేయమని కోరారట.

నిజానికి ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏడాది కి వాయిదా వేశారు. మరోవైపు "ఆర్ ఆర్ ఆర్" సినిమా ఎనిమిది భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్ పలు ప్రదేశాలు కి తిరగాల్సిన అవసరం ఉంది. అందుకే తన కమిట్మెంట్ లని వాయిదావేశారు ఎన్టీఆర్. చూస్తూ ఉంటే "ఆర్ఆర్ఆర్" సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాతే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లుగా అనిపిస్తోంది.

admin1

admin1

Next Story