Jr NTR New Movie: పవర్ ఫుల్ పొలిటీషియన్‌ గా ఎన్టీఆర్!

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్. ఎన్టీఆర్ తన నూతన సినిమాలో పూర్తి పొలిటీషియన్‌ పాత్రను పొషించనున్నట్లు తెలుస్తోంది.

Venkata Chari
Published on: 2 Jun 2021 6:09 PM IST
Junior NTR As a Politician In KGF Director Prashanth Neel New Movie
X

ఎన్టీఆర్ (ఫొటో ట్విట్టర్)

Jr NTR New Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్. ఎన్టీఆర్ తన నూతన సినిమాలో పూర్తి పొలిటీషియన్‌ పాత్రను పొషించనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పాత్రను తారక్ ఇంతవరకు ఎప్పుడూ పోషించలేదు. అభిమానులు కూడా ఇలాంటి పాత్రలో ఎన్టీఆర్‌ను ఎప్పటినుంచో చూడాలని కోరుకుంటున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలో మెప్పించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో రానున్న సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ లో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈమేరకు ఎన్టీఆర్ పాత్రను పొలిటీషియన్‌గా తీర్చిదిద్దే పనిలో ప్రశాంత్ నీల్ మునిగిపోయినట్లు సమాచారం.

మొదట్లో ప్రపంచాన్నే గడగడలాడించే మాఫియా డాన్‌లా ఎన్టీఆర్‌ని చూపించబోతున్నాడని టాక్ వినిపించింది. అలాగే జవాన్‌ లా కనిపించనున్నట్లు పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం తారక్ పొలిటీషియన్‌ గా సందడి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సమాచారం ఎంతవరకు నిజమో.. తెలియాలంటే.. మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో 'సలార్' సినిమాతో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడు. తారక్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అనంతరం కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.

Venkata Chari

Venkata Chari

Next Story