JR. NTR: తాత శతజయంతి వేడుకలకు మనవడు దూరం.. కారణం అదేనా..?

JR. NTR: ఎన్టీఆర్ శతజయంతి వేడులకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు. తన పుట్టినరోజును తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న క్రమంలోనే ఈ ఈవెంట్ కు రావడం లేదని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు.

Jyothi
Updated on: 20 May 2023 2:14 PM IST
Jr.NTR to miss the Centenary Celebrations of Sr.NTR
X

JR. NTR: తాత శతజయంతి వేడుకలకు మనవడు దూరం.. కారణం అదేనా

JR. NTR: ఎన్టీఆర్ శతజయంతి వేడులకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు. తన పుట్టినరోజును తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న క్రమంలోనే ఈ ఈవెంట్ కు రావడం లేదని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇవాళ హైదరాబాద్ లోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా ఆహ్వానాలు సైతం అందాయి.

ఈ వేడుకలకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించనున్నారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై తారకరాముడిపై వెబ్ సైట్, ప్రత్యేక సంచిక ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, కల్యాణ్ రామ్, పవన్ కల్యాణ్, ప్రభాస్, రానా, రామ్ చరణ్ హాజరు కానున్నారు. అయితే తన తాతయ్య శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు..

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వాన కమిటీ జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించింది. అయితే ఇదే రోజు తన పుట్టిన రోజు కావడం...ఆ వేడుకలను తన కుటుంబసభ్యులతో జరుపుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకోవడంతో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు డుమ్మా కొడుతున్నారట. ఈ విషయాన్ని ఆహ్వాన సమయంలోనే కమిటీకి జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశారట. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ తెలిపారు. మొత్తంగా, తాత వేడుకలకు మనవడు హాజరు కాకపోవడం నందమూరి అభిమానులకు నిరాశ కలిగించింది.

Jyothi

Jyothi

Next Story