దసరా గిఫ్ట్‌గా రామరాజు ఫర్ భీమ్ టీజర్

Arun Chilukuri
Published on: 20 Oct 2020 10:39 AM IST
దసరా గిఫ్ట్‌గా రామరాజు ఫర్ భీమ్ టీజర్
X

ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా అది వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించిన మూవీ యూనిట్.. దసరా సందర్భంగా స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతుంది. ఇప్పటికే భీమ్ ఫర్ రామరాజు టీజర్ రిలీజ్ చేసిన టీమ్ మరో మూడు రోజుల్లో రామరాజు ఫర్ భీమా వీడియో విడుదలకు రెడీ అవుతోంది. ఒక్కరోజు ఒక్కో పోస్టర్ ట్విట్టర్‌లో పెడుతూ క్యూరియాసిటీ మరింత పెంచుతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఫొటో చూసి భీమ్ కేరక్టర్ కోసం తారక్ ఎంత కష్టపడుతున్నాడో చూడండి అంటూ ఫ్యాన్స్ షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story