Jr NTR: రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమా

Jr NTRs Disaster Movie Is Getting Ready For Re Release
x

Jr NTR: రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమా 

Highlights

Jr NTR: డిజాస్టర్ సినిమాని మళ్ళీ థియేటర్ లలో విడుదల చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..

Jr NTR: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు మళ్ళీ రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే దాదాపు అందరూ స్టార్ హీరోలా ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఇప్పటిదాకా రీ రిలీజ్ అయిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సినిమాలు. కానీ తాజా సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించి డిజాస్టర్ అయిన ఒక సినిమా ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ అవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే 2004లో విడుదలై బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయిన "ఆంధ్రావాలా" సినిమా.

"సింహాద్రి" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. 2004లో సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. పూరి జగన్నాథ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ అప్పుడు ఫామ్ లో ఉండడంతో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరు అనుకున్నారు. సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ లో కూడా ఆ సినిమా గురించి అందరూ ఆకాశానికి ఎత్తేశారు. కానీ సినిమా విడుదలైన తర్వాత అంచనాలను అందుకోలేకపోయింది.

ఎన్టీఆర్ కెరియర్ లోనే కాక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ సినిమాని ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఎందుకు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు అని కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. మార్చిలో ఈ సినిమా రీ రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా ఇప్పుడు ఎంత కలెక్షన్లు నమోదు చేస్తుందో వేచి చూడండి.

Show Full Article
Print Article
Next Story
More Stories