వాళ్లతో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది అంటున్న ఎన్టీఆర్

Jr NTR: ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ ల హవా బాగానే నడుస్తుంది.

Arun Chilukuri
Published on: 15 March 2022 3:21 PM IST
Jr NTR Wishes To Do Multistarrer Films With Tollywood Superstars
X

వాళ్లతో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది అంటున్న ఎన్టీఆర్

Jr NTR: ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ ల హవా బాగానే నడుస్తుంది. ఒకవైపు సీనియర్ హీరో వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయగా, పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కూడా కలిసి "భీమ్లా నాయక్" అనే మల్టీస్టారర్ లో కనిపించారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు "ఆర్ఆర్ఆర్" అనే ఒక హై బడ్జెట్ మల్టీ స్టారర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎన్టీఆర్ కి మరికొన్ని మల్టీస్టారర్ సినిమాల్లో నటించాలని ఉందట.

ఒకవేళ మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు అని అడగగా ఎన్టీఆర్ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు. మల్టీస్టారర్ సినిమాలకి తాను ఎప్పుడూ రెడీగానే ఉంటానని చెప్పిన ఎన్టీఆర్ బాలా బాబాయ్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలు చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. "చిరంజీవి గారు మహేష్ బాబు ప్రభాస్ మరియు అల్లు అర్జున్ తో కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయాలని ఉంది" అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. మరి ఏ డైరెక్టర్ ఈ స్టార్ కాంబో తో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతారో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story