Jr NTR: రెండు సినిమాలతో బిజీ కాబోతున్న తారక్

Jr NTR: ఒకేసారి రెండు సినిమాలు చేయనున్నా ఎన్టీఆర్

admin1
Updated on: 5 Jan 2022 3:30 PM IST
Jr NTR Will Act in Two Films Simultaneously | Tollywood News Today
X

 ఒకేసారి రెండు సినిమాలు చేయనున్నా ఎన్టీఆర్

Jr NTR: ఆఖరిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపై కనిపించింది 2018 అక్టోబర్ లో విడుదలైన "అరవింద సమేత" సినిమాతో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ వెండితెరపై కనిపించింది లేదు. అప్పటినుంచి ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో బిజీగానే ఉన్నారు. ఇక భారీ అంచనాల మధ్య "ఆర్ ఆర్ ఆర్" సినిమా జనవరి 7న విడుదల అవుతుంది అని అభిమానులు కలలు కన్న సంగతి తెలిసిందే. కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. దీంతో అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తన సమయాన్ని వృధా చేయకూడదని తారక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారట. అయితే ఈ సినిమాతో పాటే మరొక సినిమాని కూడా పట్టాలెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్టీఆర్. "ఉప్పెన" ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ ఈ మధ్యనే స్క్రిప్ట్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి మొదలు పెట్టి త్వరగా పూర్తి చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే బుచ్చి బాబు-ఎన్టీఆర్ సినిమా గురించన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

admin1

admin1

Next Story