Jr NTR: "నాన్న సినిమాని రీమేక్ చేయాలని ఉంది" అంటున్న ఎన్టీఆర్

Jr NTR Wants to Remake Harikrishna Movie | Telugu News
x

"నాన్న సినిమాని రీమేక్ చేయాలని ఉంది" అంటున్న ఎన్టీఆర్

Highlights

Jr NTR: హరికృష్ణ సినిమాని రీమేక్ చేయాలి అనుకుంటున్న ఎన్టీఆర్

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా "ఆర్ఆర్ఆర్" పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చ్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు కీరవాణి కలిసి ఒక ప్రమోషనల్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పుడు బాగానే ట్రెండ్ అవుతుంది.

అందులో మాట్లాడుతూ కీరవాణి ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సినిమాలలో సీతయ్య సినిమాకి సంగీతాన్ని అందించినట్లు చెప్పుకొచ్చారు. వెంటనే ఎన్టీఆర్ కుదిరితే తనకు ఆ సినిమాని రీమేక్ చేయాలని ఉందని, ఆ సినిమాలో ఉండే ఇంటెన్సిటీ మరియు హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటాయని చెప్పుకొచ్చారు. పక్కనే ఉన్న చరణ్ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుంటూ ఆ కథకు మోడర్న్ టచ్ ఇస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నారు. మరి సీతయ్య సినిమా డైరెక్టర్ వై.వి.యస్.చౌదరి ఎన్టీఆర్ ను సంప్రదిస్తారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories