Jr NTR: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ అభిమానికి జూ.ఎన్టీఆర్‌ వీడియో కాల్

Jr NTR Video Call to His Fan who is Suffering from Kidney Failure | Tollywood News Today
x

Jr NTR: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ అభిమానికి జూ.ఎన్టీఆర్‌ వీడియో కాల్

Highlights

Jr NTR: సంపూర్ణ ఆరోగ్యంతో బయటకొస్తావని ధైర్యం చెప్పిన తారక్‌..

Jr NTR: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ అభిమానికి వీడియో కాల్‌ చేసి ఆత్మస్థైర్యం నింపారు జూనియర్‌ ఎన్టీఆర్. తూర్పుగోదావరి జిల్లా గూడపల్లికి చెందిన మురళి.. ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఇటీవల జరిగిన ఓ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డ మురళి.. విజయవాడ రమేష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రెండు కిడ్నీలు దెబ్బతిని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళి.. తన చివరి కోరికగా జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలవాలని డాక్టర్లను కోరాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌.. మురళితో వీడియో కాల్‌లో మాట్లాడారు. సంపూర్ణ ఆరోగ్యంతో బయటకొస్తావని ధైర్యం చెప్పారు తారక్.


Show Full Article
Print Article
Next Story
More Stories