Jr Ntr: మోక్షజ్ఞ ఎంట్రీ.. తమ్ముడికి విషెస్ చెప్పిన ఎన్టీఆర్..!

Jr Ntr Tweet On Nandamuri Mokshagna: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.

Arun Chilukuri
Updated on: 6 Sept 2024 2:35 PM IST
Jr Ntr Tweet On Nandamuri Mokshagna
X

Jr Ntr: మోక్షజ్ఞ ఎంట్రీ.. తమ్ముడికి విషెస్ చెప్పిన ఎన్టీఆర్..!

Jr Ntr Tweet On Nandamuri Mokshagna: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. హనుమాన్‌ మూవీతో పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేసిన టాలీవుడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞను గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నాడు. ది లయన్‌ కింగ్‌లోని ఓ ఫొటోను షేర్ చేశాడు ప్రశాంత్‌ వర్మ. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.

ఈ క్ర‌మంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు మోక్ష‌జ్ఞ‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డంతో పాటు మొద‌టి సినిమాకు ఆల్‌ది బెస్ట్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సినీ రంగంలో అడుగుపెడుతున్న మోక్ష‌జ్ఞ‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

‘సినీ ప్ర‌పంచంలోకి అడుగుపెడుతున్నందుకు అభినందన‌లు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న క్ర‌మంలో మీకు అన్ని దైవిక శ‌క్తులతో పాటు తాత‌గారి ఆశీర్వాదంతో ఉంటుంది.’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అదే స‌మ‌యంలో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

''తాత (ఎన్టీఆర్)గారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని నందమూరి కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. మోక్షజ్ఞకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు 'వెల్కమ్ టు ద టిన్సిల్ టౌన్ మోక్షు' అని పేర్కొన్నారు. మోక్షజ్ఞను కుటుంబ సభ్యులు మోక్షు అని పిలుస్తారు. ఈ విషయం ప్రేక్షకులకు తెలిసిందే.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story