మొట్టమొదటిసారిగా అలాంటి పాత్రలో తారక్

Jr NTR to Play a Kabbadi Player in His Next Film
x

మొట్టమొదటిసారిగా అలాంటి పాత్రలో తారక్

Highlights

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా మార్చి 25న థియేటర్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా మార్చి 25న థియేటర్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు ఎన్టీఆర్. "ఉప్పెన" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఒక సినిమాని సైన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక కబడ్డీ ఆటగాడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఎన్టీఆర్ తన కెరియర్ లో కబడ్డీ ప్లేయర్ గా కనిపించింది లేదు.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఒక హార్ట్ హిట్టింగ్ ఎమోషనల్ డ్రామా గా ఈ సినిమా ఉండబోతోందని, సినిమా కథ మొత్తం పల్లెటూరు నేపథ్యంలోనే సాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారట బుచ్చి బాబు. ఎన్టీఆర్ ఫైనల్ స్క్రిప్ట్ కూడా పూర్తయ్యాక గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కొరటాల శివ తో సినిమా తరువాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు ఎన్టీఆర్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories