Jr NTR: కర్ణాటక అసెంబ్లీకి జూనియర్ ఎన్టీఆర్..!

*కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో నవంబర్ 1న జరిగే వేడుకలకు హాజరుకానున్నారు

Rama Rao
Published on: 31 Oct 2022 7:25 AM IST
Jr NTR to Attend Late Puneeth Rajkumars Karnataka Ratna Award Ceremony
X

Jr NTR: కర్ణాటక అసెంబ్లీకి జూనియర్ ఎన్టీఆర్..!

Jr NTR: తన నటనతో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండడం ఆసక్తికరంగా మారింది. కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో నవంబర్ 1న జరిగే వేడుకలకు హాజరుకానున్నారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్కు 'కర్ణాటక రత్న' విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ వేడుకలకు తారక్‌తోపాటు రజనీకాంత్, రాజ్ కుమార్ కుటుంబం, జ్ఞానపీఠ్​అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, కన్నడ కవులు, కళాకారులు, రచయితలను ఆహ్వానించినట్లు సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు కన్నడ నాట కూడా మంచి జనాదరణ పొందారు. తన ఆహ్వానంపై కర్ణాటక అసెంబ్లీలో జరిగే వేడుకలకు హాజరయ్యేందుకు జూనియర్ ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story