Jr NTR: తహశీల్దార్‌ కార్యాలయంలో ఎన్టీఆర్‌.. ఆ భూమి రిజిస్ట్రేషన్..

Jr NTR: రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లిలోని తహశీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సందడి చేశారు.

Arun Chilukuri
Updated on: 31 July 2021 1:22 PM IST
Jr NTR Spotted at Tahsildar Office in Shankarpalli
X

Jr NTR: తహశీల్దార్‌ కార్యాలయంలో ఎన్టీఆర్‌.. ఆ భూమి రిజిస్ట్రేషన్..

Jr NTR: రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లిలోని తహశీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సందడి చేశారు. ఎన్టీఆర్ రాకతో తహశీల్దార్‌ కార్యాలయంలో సందడి వాతావరణం కనిపించింది. ఎన్టీఆర్ తో ఫొటోలు దిగేందుకు ఉద్యోగులు సైతం పోటీ పడ్డారు. ఎన్టీఆర్ ఎవరినీ నిరాశపర్చకుండా అందరికీ ఓపిగ్గా ఫొటోలకు పోజులిచ్చారు.

గోపాలపురం గ్రామంలోని రెవెన్యూ పరిధిలో ఆయన ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలు చేశారని, అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల కోసమే ఎమ్మార్వో ఆఫీస్‌కి వెళ్లారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్‌తో కలిసి 'ఆర్ఆర్ఆర్' లో నటిస్తున్నాడు. షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌కి చేరుకున్న ఈ పాన్ ఇండియా ఫిలిం దసరా కానుకగా అక్టోబర్ 13న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story