ఎన్టీఆర్‌ యాసపై ట్రోల్స్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన యంగ్‌ టైగర్‌

ఎన్టీఆర్‌ యాసపై ట్రోల్స్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన యంగ్‌ టైగర్‌

Arun Chilukuri
Updated on: 18 Jan 2023 8:00 PM IST
Jr NTR Slams Those Trolling Him For Faking American Accent
X

ఎన్టీఆర్‌ యాసపై ట్రోల్స్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన యంగ్‌ టైగర్‌

Jr NTR: "ఆర్ఆర్ఆర్" సినిమా పుణ్యమా అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పాకింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఎన్టీఆర్ మాట్లాడిన భాష ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ అమెరికన్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడారు. కానీ అది కొంతమందికి నచ్చలేదు. దీంతో ఎన్టీఆర్ ను సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు. సాధారణమైన ఇంగ్లీషులో మాట్లాడితే బాగుండేదని అంత కష్టపడి అమెరికన్స్ స్లాంగ్ లో మాట్లాడాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. అసలు ఎన్టీఆర్ అమెరికన్ స్లాంగ్ బాలేదని కనీసం తన మాటలు అర్థం కూడా కావటం లేదని మరి కొందరు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా దీని గురించి రియాక్ట్ అయ్యారు ఎన్టీఆర్. దేశాన్ని బట్టి ఒక్కో యాస ఉంటుంది. ఎవరి భాష వారిది ఎవరి యాస వారిది అన్నట్టు ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ కు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే ఎన్టీఆర్ అతి త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాలి. #ఎన్టీఆర్30 అనే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా మరియు బుచ్చిబాబు సన దర్శకత్వంలో మరొక సినిమాని లైన్లో పెట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story