జూనియర్ ఎన్టీఆర్‌తో పాట పాడించుకున్న పునీత్.. పాడిన పాట ఏంటంటే?

JR NTR: తెలుగు ప్రేక్షకుల్లోనూ పునీత్ రాజ్‌ కుమార్‌కు మంచి క్రేజ్ ఉంది.

Arun Chilukuri
Published on: 29 Oct 2021 4:59 PM IST
JR NTR Sings Geleya Geleya Song for Puneeth Rajkumar
X

JR NTR: తెలుగు ప్రేక్షకుల్లోనూ పునీత్ రాజ్‌ కుమార్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఇటీవల పునీత్ నటించిన "యువరత్న" చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పునీత్ రాజ్‌కుమార్‌కు జూనియర్ ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరి మధ్య స్నేహబంధం ఉంది. ఎన్టీఆర్ పాటలను ఎంతో ఇష్టపడిన పునీత్ రాజ్ కుమార్ తన సినిమాలో ఓ పాటను పాడాలని స్వయంగా కోరారట.

దీంతో ఎన్టీఆర్ ఓకే చెప్పేశారు. పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాటను కూడా పాడారు. గెలియా.. గెలియా.. అనే ఆ పాట సూపర్ హిట్టైంది. సినిమా సూపర్ హిట్ అవడంలో ఆ పాట పాత్ర కూడా ఎంతో ఉంది. పునీత్ రాజ్ కుమార్ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తారని అభిమానులు ఆశించారు కానీ.. ఇంతలోనే ఇలాంటి ఘోరం జరిగిపోయింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story