Jr NTR: మా మధ్య పోటీ ఉంది" అంటున్న ఎన్టీఆర్

Jr NTR: 30 - 35 సంవత్సరాలుగా మా మధ్య వైరం ఉంది అంటున్న ఎన్టీఆర్

admin1
Updated on: 26 Dec 2021 7:01 PM IST
Jr NTR Said there was Competition between the two families 30-35 years ago | Tollywood News Today
X

30 - 35 సంవత్సరాలుగా మా మధ్య వైరం ఉంది అంటున్న ఎన్టీఆర్

Jr NTR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్యాన్ ఇండియన్ మల్టీస్టారర్ సినిమా "ఆర్ఆర్ఆర్". ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల కాబోతోంది. తాజాగా చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న చిత్ర బృందం ఒక పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటోంది. అలాగే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎన్టీఆర్ నందమూరి మరియు మెగా ఫ్యామిలీ ల గురించి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

"నేను ఇది చెప్పచ్చో లేదో నాకు తెలియదు. కానీ మా రెండు కుటుంబాల మధ్య పోటీ 30-35 సంవత్సరాల ముందు నుండి ఉంది. కానీ ఇప్పుడు ఆ రెండు కుటుంబాల నుండి ఇద్దరు నటులు కలిసి సినిమా చేస్తున్నారు. మేము ప్రత్యర్థుమే. కానీ మేము మంచి స్నేహితులం కూడా. మా పోటీ చాలా పాజిటివ్ గా ఉంటుంది" అని అన్నారు ఎన్టీఆర్. తారక్ అన్న మాటల్లో నిజం లేకపోలేదు. మెగా ఫ్యామిలీ మరియు నందమూరి ఫ్యామిలీ ల మధ్య పోటీ ఇప్పటిది కాదు. చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఉండే పోటీ ఇప్పుడు చరణ్ ఎన్టీఆర్ మధ్య కూడా ఉంది. అయితే ఈ రెండు కుటుంబాల హీరోల కలయికలో రాబోతున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా మెగా మరియు నందమూరి అభిమానులను కూడా కలిపే విధంగా ఉంటుందని చెప్పచ్చు.

admin1

admin1

Next Story