Jr NTR: రాజమౌళి తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్

Jr NTR: మహేష్ బాబు నెక్ట్స్ సినిమా డైరెక్టర్ రాజమౌళి అంటున్న ఎన్టీఆర్

admin1
Published on: 6 Dec 2021 4:47 PM IST
Mahesh Babu Next Movie Director Rajamouli Says JrNTR
X

మహేష్ బాబు నెక్ట్స్ సినిమా డైరెక్టర్ రాజమౌళి అంటున్న ఎన్టీఆర్ (ఫైల్-ఫోటో)

Jr NTR: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు హీరోగా పెట్టి సినిమా చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి తప్ప అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోస్ట్ చేస్తున్న "ఎవరు మీలో కోటీశ్వరుడు" గేమ్ షో మహేష్ బాబు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజమౌళి నెక్స్ట్ సినిమాలో హీరో మహేష్ బాబు అని రివిల్ చేసేసారు. దీంతో మొదటిసారిగా రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఎలా ఉండబోతోందో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

admin1

admin1

Next Story