NTR About Politics: నా పొలికట్ ఎంట్రీ.. మీరే డిసైడ్ చేయాలి - ఎన్టీఆర్

NTR About Politics: జూనియర్ ఎన్టీఆర్‌‌ పొలిటికట్ ఎంట్రీ ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Venkata Chari
Published on: 13 March 2021 6:09 PM IST
NTR About Politics
X

జూ.ఎన్టీఆర్ (ఫొటో ట్విట్టర్)

NTR About Politics: జూనియర్ ఎన్టీఆర్‌‌ పొలిటికట్ ఎంట్రీ ప్రస్తుతం ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల నాటికి ఎన్టీఆర్‌ రాజకీయంగా గుడ్ న్యూస్ వస్తుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దీనిపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'ఎవరు మీలో కోటీశ్వరుడు' త్వరలో జెమిని టీవీలో టెలికాస్ట్ కానుంది. ఈ షోకు సంబంధంచిన ప్రోమోను తాజాగా విడుదల చేసి, ఎన్టీఆర్‌తో శుక్రవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ను ఓ విలేకరి పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు. దీనిపై ఎన్టీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. 'ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకు నేను ఏ జవాబు చెబుతానో కూడా మీకు తెలుసు' అంటూ దాటేశారు. అయితే రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సందర్భం కాదన్నారు. దీని గురించి మరొసారి తీరిగ్గా కాఫీ తాగుతూ చర్చించుకుందామంటూ తేల్చేశారు.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌ ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన కొమురం భీం పాత్ర‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ‌్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Venkata Chari

Venkata Chari

Next Story