EMK - Jr NTR: "ఎవరు మీలో కోటీశ్వరులు" ఆఫర్ ను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్

*భారీ రెమ్యునరేషన్ ఉన్నప్పటికీ నో అంటున్న ఎన్టీఆర్

admin1
Updated on: 24 Oct 2021 6:30 PM IST
Jr NTR Rejected Evaru Meelo Koteeswarulu Second Season Host Offer
X

"ఎవరు మీలో కోటీశ్వరులు" ఆఫర్ ను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్

Evaru Meelo Koteeswarulu - Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "ఎవరు మీలో కోటీశ్వరులు" అనే టాక్ షో త్వరలో పూర్తి కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం మరొక సీజన్ ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ని మళ్లీ నెక్స్ట్ సీజన్ కి కూడా హోస్ట్ గా రమ్మని సంప్రదించారు.

ఎంత భారీ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఈ ఆఫర్ కి ససేమిరా ఒప్పుకోలేదట. ఒకప్పుడు చానల్స్ లో నెంబర్ వన్ గా ఉండే జెమినీ టీవీ ఇప్పుడు మా టీవీ, జీ టీవీ మరియు ఈటీవీ తర్వాత నాలుగవ స్థానాన్ని తీసుకుంది. అందుకే రేటింగ్ ని పెంచుకోవటానికి "ఎవరు మీలో కోటీశ్వరులు" మరియు "మాస్టర్ చెఫ్" ప్రోగ్రాం లను మొదలుపెట్టింది జెమిని టివి.

కానీ ఈ రెండు ప్రోగ్రామ్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ని వచ్చే సెకండ్ సీజన్ కోసం కూడా హోస్ట్ గా తీసుకురావాలని ప్లాన్ చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇక ఈ ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరించడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొన్నాళ్లపాటు టీవీ షో లకి గ్యాప్ ఇచ్చి సినిమాల మీద మళ్లీ ఫోకస్ చేయాలని అనుకుంటున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. "జనతా గ్యారేజ్" సినిమా తర్వాత ఎన్టీఆర్ మరియు కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది.

admin1

admin1

Next Story