Jr NTR: ఆ ముగ్గురితో ఐలాండ్లో ఉండడానికి రెడీ అంటున్న తారక్

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు "ఆర్ ఆర్ ఆర్" సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే...

admin1
Updated on: 26 March 2022 11:31 AM IST
Jr NTR Ready to Live with Ram Charan Rana Daggubati Anirudh Ravichandran in Island | Live News
X

Jr NTR: ఆ ముగ్గురితో ఐలాండ్లో ఉండడానికి రెడీ అంటున్న తారక్

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు "ఆర్ ఆర్ ఆర్" సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్న ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. భవిష్యత్తులో ఏ డైరెక్టర్ తో మళ్లీ ఈ సినిమా చేయాలని అనుకుంటున్నారు అని అడగగా ఎన్టీఆర్ క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే రాజమౌళి అని చెప్పారు. ఇక తన ఫోన్ లో ఎక్కువగా ప్లే అయ్యే పాట ఆశ పాశం అని అన్నారు.

ఇక తన సినిమాలలో దేనికి సీక్వెల్ తీయాలని అనుకుంటున్నారు అని అడగగా అదుర్స్ అని అన్నారు ఎన్టీఆర్. ఇంకా ఎమర్జెన్సీ లో ఉన్నప్పుడు తాను చేసే మొట్టమొదటి ఫోన్ తన భార్య ప్రణతికి అని అన్నారు తారక్. ఇక ఇండస్ట్రీలోని ముగ్గురు వ్యక్తులతో ఒక ఐలాండ్లో బతకాల్సి వస్తే ఎన్టీఆర్ తన తో పాటు ఉండే ముగ్గురు సెలబ్రిటీలు రామ్ చరణ్ రానా మరియు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అని అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అన్న ఈ మాటలు ఇప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

admin1

admin1

Next Story