చంద్రబాబు ట్వీట్.. ఎన్టీఆర్ రిప్లై..

చంద్రబాబు ట్వీట్.. ఎన్టీఆర్ రిప్లై..

Arun Chilukuri
Published on: 11 Jan 2023 5:38 PM IST
Jr NTR Reacts to Chandrababu Tweet
X

చంద్రబాబు ట్వీట్.. ఎన్టీఆర్ రిప్లై..

Natu Natu Song: ట్రిపుల్ ఆర్‌ చిత్రంలోని నాటు - నాటు పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం గోల్డెన్‌ గ్లోబ్‌ అందడం పట్ల యావత్​సినీ ప్రపంచం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోడీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్రిపుల్ ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తనకు చాలా గర్వంగా ఉందని.. తాను ముందే చెప్పినట్లు ప్రపంచ భాషల్లో తెలుగు భాష సత్తా చాటిందన్నారు.

అయితే చంద్రబాబు ట్వీట్‌కు ట్రిపుల్ ఆర్ చిత్రంలో హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. థాంక్యూ సో మచ్ మావయ్య అంటూ రిప్లై ఇచ్చారు. గత కొన్నాళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీకి పునర్వైభవం తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ తారక్ మాత్రం రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి చూపలేదు. ఇప్పుడు చంద్రబాబు ట్వీట్‌కు తారక్ స్పందించడంపై అభిమానులు ఆనందంతో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ ట్వీట్​ సోషల్ ​మీడియాలో వైరల్​ అవుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story