Jr NTR: క్రిటికల్‌గా ఉన్నప్పటికీ వైద్యానికి స్పందిస్తున్నారు

Jr NTR: ఐసీయూలోకి వెళ్లి పలకరించే ప్రయత్నం చేశా.. కొంత స్పందన కన్పిస్తుంది

Jyothi
Published on: 29 Jan 2023 1:12 PM IST
Jr NTR Reacts About Taraka Ratna Helath Condition
X

Jr NTR: క్రిటికల్‌గా ఉన్నప్పటికీ వైద్యానికి స్పందిస్తున్నారు

Jr NTR: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నకు అత్యవసర చికిత్స కొనసాగిస్తున్నారు. వైద్య బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేస్తోంది. అత్యవసర చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు కుటుంబ సభ్యులు ఒకొక్కరుగా బెంగళూరు చేరుకుంటున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్లారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి, ఇతర కుటుంబసభ్యులు ఆస్పత్రికి వచ్చారు. బెంగళూరు చేరుకున్న అనంతరం ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ, కుటుంబ సభ్యులతో మాట్లాడి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మరోవైపు కర్ణాటక మంత్రి కూడా నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

తారకరత్నకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నా జూనియర్ ఎన్టీఆర్. క్రిటికల్‌గా ఉన్నప్పటికీ వైద్యానికి స్పందిస్తున్నారని.. ఐసీయూలోకి వెళ్లి పలకరించే ప్రయత్నం చేశా,.. కొంత స్పందన కన్పిస్తుందన్నారు. నిన్నటితో పోలిస్తే పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామన్నారు.

Jyothi

Jyothi

Next Story