Dragon Movie : ఎన్టీఆర్ గడ్డం పెంచేది అందుకేనా ..లీకులపై పుల్ క్లారిటీ ఇచ్చిన డ్రాగన్ టీమ్

Dragon Movie
x

Dragon Movie : ఎన్టీఆర్ గడ్డం పెంచేది అందుకేనా ..లీకులపై పుల్ క్లారిటీ ఇచ్చిన డ్రాగన్ టీమ్

Highlights

Dragon Movie : కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే పక్కా ప్లానింగ్, పూర్తి సన్నద్ధత అని అర్థం. స్క్రిప్ట్‌తో సహా ప్రతి విషయంపై క్లారిటీతోనే ఆయన సెట్‌కి వెళ్తారు.

Dragon Movie : కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే పక్కా ప్లానింగ్, పూర్తి సన్నద్ధత అని అర్థం. స్క్రిప్ట్‌తో సహా ప్రతి విషయంపై క్లారిటీతోనే ఆయన సెట్‌కి వెళ్తారు. అలాంటిది యంగ్ టైగర్ ఎన్టీఆ తో ఆయన తీయబోయే సినిమా ఆగిపోయిందనే వార్తలు ఇటీవల సినీ వర్గాల్లో హల్‌చల్ చేశాయి. ముఖ్యంగా, ప్రశాంత్ నీల్ పనితీరుపై ఎన్టీఆర్ సంతృప్తిగా లేరు అంటూ వచ్చిన నివేదికలు అభిమానులలో ఆందోళన రేకెత్తించాయి. అయితే తాజాగా అందిన సమాచారంతో ఈ గందరగోళానికి పూర్తిగా తెరపడింది.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ చిత్రం షెడ్యూల్ నిలిచిపోయిందనే వార్తలకు సమాధానంగా, తదుపరి షూటింగ్ ప్లాన్ ఖరారైంది. డిసెంబర్ 8 నుంచే ఈ చిత్రం రెండవ దశ షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కుమటా ప్రాంతంలో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. రెండవ షెడ్యూల్‌లో ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వార్త విని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుత ప్లాన్ ప్రకారం ఈ షూటింగ్ క్రిస్మస్ వరకు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం చిత్ర యూనిట్ కొత్త సంవత్సరం సందర్భంగా బ్రేక్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గి, చాలా సన్నగా మారడంపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ ఎందుకు అంత సన్నబడ్డారు అనే ప్రశ్నకు సినిమాలోనే సమాధానం దొరుకుతుందని తెలుస్తోంది. ఆయన కొత్త లుక్ చూసి కొంతమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఈ లుక్ వెనుక బలమైన కారణం సినిమా కథలో భాగమై ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు సూచిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories