Jr NTR: మరొక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్...

Jr NTR Next Movie with Koratala Shiva of 300 Crore Budget | Tollywood Latest News
x

Jr NTR: మరొక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్

Highlights

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే...

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "జనతాగ్యారేజ్" తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం నిర్మాత ఏకంగా 300 కోట్ల దాకా బడ్జెట్ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ కూడా ఉండబోతుందని సమాచారం. ఇక మరోవైపు ఈ సినిమా షూటింగ్ ను రెండు నెలల్లో పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవికే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం స్పెషల్ సెట్లను సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ స్థాయికి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా ఉండబోతోందని తెలుస్తోంది.

మరో వైపు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ లేదా మేలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత జూన్ లో ఎన్టీఆర్ తో సినిమాని మొదలు పెట్టబోతున్నారు కొరటాల.

Show Full Article
Print Article
Next Story
More Stories