కేజీఎఫ్ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్... భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌?

కేజీఎఫ్ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్... భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌?
x
Director prashanth Neel, Jr NTR
Highlights

టెంపర్ సినిమా నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.

టెంపర్ సినిమా నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జయ లవ కుశ, అరవింద సమేత వీర రాఘవ ఇలా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఎన్టీఆర్ కి 29వ సినిమా కావడం విశేషం.. ఇక ఈ సినిమా తరవాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నాడు. ఈ సినిమాని హారిక, హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఏంటి అన్న దాని గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎక్కువగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే దీనిపైన ఎన్టీఆర్, ప్రశాంత్ మధ్య చర్చలు జరిగాయని వార్తలు రాగా ఇప్పుడు కన్ఫర్మ్ అయిందనే వార్తలు వినిపిస్తోంది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా అయిపోయాక ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నరని ఫిలిం నగర్ నుంచి వార్త హల చల్ చేస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా, ఎన్టీఆర్‌ని డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో ప్రెజెంట్ చేసే ప్లాన్ లో చిత్ర బృందం ఉన్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా రెండేళ్ళ డేట్స్ ఇచ్చారట .. 2021 చివరి నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలై 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తుందట.. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారని సమాచారం.. త్వరలో దీనిపైన అధికార ప్రకటన వెలువడనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories