మహేష్ బాబు సినిమా ఎన్టీఆర్ సినిమా కాపీనా

మహేష్ బాబు సినిమా ఎన్టీఆర్ సినిమా కాపీనా
x
Highlights

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్బస్టర్ అందుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా 'మహర్షి' అనే సినిమాతో మరో హిట్ ను నమోదు చేసుకున్నాడు. వంశీ...

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్బస్టర్ అందుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా 'మహర్షి' అనే సినిమాతో మరో హిట్ ను నమోదు చేసుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యాక మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. తాజాగా మహేష్ కి పరాశురాం సినిమా కథ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఈ సినిమాలో విలన్ చేసిన ఆర్థిక నేరాలు మహేష్ బాబు తల్లి పై పడి ఆమె ఉద్యోగానికి దూరం అవుతుందట. ఈ నేపథ్యంలో మహేష్ బాబు విదేశాలకు పారిపోయిన ఆ విలను పట్టుకొని అతనిపై రివెంజ్ తీర్చుకోవడం సినిమా కథట. ఇది కొంచెం అటుఇటుగా 'నాన్నకు ప్రేమతో' సినిమా లాగానే ఉంది. కాకపోతే అందులో టైటిల్కి తగ్గట్టు నాన్న పాత్ర కోసం రివెంజ్ తీర్చుకొంటాడు ఎన్టీఆర్. అంతే తప్ప ఈ రెండు సినిమాల మధ్య పెద్దగా బేధాలు ఏమీ కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏది నమ్మడానికి లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories