విశ్వక్ సేన్ సినిమాని ప్రమోట్ చేయనున్న ఎన్టీఆర్

* విశ్వక్ సేన్ సినిమాని ప్రమోట్ చేయనున్న ఎన్టీఆర్

Dhatripriya
Updated on: 9 March 2023 4:00 PM IST
Star Hero Is Doing Vishwak Sens Movie Promotions
X

స్టార్ హీరో చేయనున్న విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్లు

Dhamki Promotions: తన సినిమా ప్రమోషన్ల విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు ముందే ఉంటారు కానీ మిగతా హీరోల సినిమాలను ప్రమోట్ చేసే విషయంలో ఎన్టీఆర్ అంతగా ఆసక్తి చూపించరు. మిగతా హీరోల సంగతి పక్కన పెడితే కేవలం కుటుంబ సభ్యుల సినిమాలను మాత్రమే ఎన్టీఆర్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు ఎన్టీఆర్ అటెండ్ అయిన ఈవెంట్లలో కళ్యాణ్ రామ్ సినిమాలే ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత కీరవాణి, స్వప్న దత్ ల సినిమాలను కూడా ఎన్టీఆర్ అప్పుడప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఒక యువ హీరో సినిమాని ప్రమోట్ చేస్తూ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో త్వరలో "ధమ్కీ" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఈనెల 17వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ కూడా పాల్గొన బోతున్నట్లు తెలుస్తోంది.

విశ్వక్ సేన్ కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. తన అభిమాన హీరో స్వయంగా వచ్చి తన సినిమాని ప్రమోట్ చేయబోతుండం తో విశ్వక్ సేన్ ఆనందానికి అవధులు లేవని తెలుస్తోంది. మరోవైపు మార్చి 12న ఆస్కార్స్ కారణంగా ఎన్టీఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మరొకసారి వినిపించనుంది. అలాంటి ప్యాన్ ఇండియా స్టార్ తన సినిమాని ప్రమోట్ చేస్తే కచ్చితంగా ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. మరి విశ్వక్ సేన్ ఈ సినిమాతో ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story