అభిమాని కోరిక తీర్చిన హీరో ఎన్టీఆర్!

అభిమాని కోరిక తీర్చిన హీరో ఎన్టీఆర్!
x
Highlights

తన అభిమానుల కోసం ఎన్టీఆర్ ఎంతగా తపిస్తాడో మరోసారి నిరూపించాడు. తన అభిమానుల కోరికను తీర్చడంతో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు కూడా ఒక అభిమాని కోరికను వీడియో కాల్‌ ద్వారా తీర్చాడు.

తన అభిమానుల కోసం ఎన్టీఆర్ ఎంతగా తపిస్తాడో మరోసారి నిరూపించాడు. తన అభిమానుల కోరికను తీర్చడంతో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు కూడా ఒక అభిమాని కోరికను వీడియో కాల్‌ ద్వారా తీర్చాడు. నల్లగొండ జిల్లా చండూరు గ్రామానికి చెందిన వెంకన్న చిన్నతనం నుంచి ఎన్టీఆర్ వీరాభిమాని. అయితే.. ఆయనకు కొన్ని రోజుల క్రితం ఎల్బీనగర్‌లో బస్ నుంచి కింద పడ్డాడు. ఆ ప్రమాదంలో వెంకన్న స్పైనల్ కార్డు దెబ్బ తిని.. బాడీలో 90శాతం పనిచేయకుండా ఉన్నాయి. తన జీవిత కోరిక ఒక సారి ఎన్టీఆర్‌ను కలిసి ఫోటో దిగాలని ఉండేదని.. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ కరోనా టైమ్‌లో రావడం కుదరక.. అభిమాని కోరికను తీర్చేందుకు వీడియో కాల్ చేసి అభిమానిని సంతోష పరిచాడు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ RRR అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ వలన వాయిదా పడి తాజాగా మొదలైంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడం, బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తరవాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అజయ్ దేవగన్, శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories