లక్ష్మీస్ ఎన్టీఆర్ లో జూనియర్ ఎన్టీఆర్

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో జూనియర్ ఎన్టీఆర్
x
Highlights

నందమూరి తారకరామారావు బయోపిక్ పేరుతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా ఎన్టీఆర్ రెండో...

నందమూరి తారకరామారావు బయోపిక్ పేరుతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఎంట్రీ నుంచి మొదలవుతుందని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు థియేట్రికల్ ట్రైలర్ లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి ఈ చిత్ర ట్రైలర్ లు మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా ఉండబోతుందట.

జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి తో కలిసి ఒక ఫోటో దిగినట్లు కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మరుక్షణం ఆ ఫోటోలో లక్ష్మీపార్వతిని ఫోటోలో చింపేసిన సందర్భం గురించి లక్ష్మీపార్వతి ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు అదే సీను సినిమాలో పెట్టినట్లు తెలుస్తోంది. అది ఎన్టీఆర్ పసితనంతో చేసినప్పటికీ అలాంటి నెగటివ్ సన్నివేశంలో చూపించడం ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే వైఎస్సార్ పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామాయ్య తన పలుకుబడిని ఉపయోగించి ఈ సినిమాలో అలాంటి సీన్ ఉందా లేదా కనుక్కొని ఉంటే మాత్రం దానిని వెంటనే తీసేయాలని చూస్తున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories