పునీత్ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న ఎన్టీఆర్

Puneeth Rajkumar: తన ప్రాణ స్నేహితుడు, కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.

Arun Chilukuri
Published on: 30 Oct 2021 3:38 PM IST
Jr NTR Gets Emotional, Pays Homage to Puneeth Rajkumar
X

పునీత్ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న ఎన్టీఆర్

Puneeth Rajkumar: తన ప్రాణ స్నేహితుడు, కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. పునీత్‌ మరణంతో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం బెంగళూరుకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ కంఠీరవ మైదానంలో పునీత్ శ్రద్ధాంజలి ఘటించారు. పునీత్‌ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. తారక్‌ని చూసిన పునీత్‌ సోదరుడు శివ రాజ్‌కుమార్‌ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే తారక్‌ ఆయన్ని ఆలింగనం చేసుకుని ఓదార్చారు. తారక్‌తోపాటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ పునీత్‌కు నివాళులర్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story