Jr NTR: ఎన్టీఆర్ ఫోటోల మార్ఫింగ్.. సీపీ సజ్జనార్‌కు ఫ్యాన్స్ ఫిర్యాదు!

Jr NTR: ఎన్టీఆర్ ఫోటోల మార్ఫింగ్.. సీపీ సజ్జనార్‌కు ఫ్యాన్స్ ఫిర్యాదు!
x

Jr NTR: ఎన్టీఆర్ ఫోటోల మార్ఫింగ్.. సీపీ సజ్జనార్‌కు ఫ్యాన్స్ ఫిర్యాదు!

Highlights

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫ్డ్ ఫొటోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫ్డ్ ఫొటోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫ్డ్, అసభ్య ఫొటోలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి నందిపాటి మురళి హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు సమర్పించారు. ఈ ఫొటోలను సృష్టించి, వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ఫొటోలు ఎన్టీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి, సైబర్ క్రైమ్ విభాగానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చురుగ్గా స్పందిస్తూ, దోషులను శిక్షించాలని కోరుతున్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories