Jr NTR Fan: 75 టికెట్లు కొన్న ఎన్టీఆర్ ఫ్యాన్

Jr NTR Fan: అందరికి షాకిచ్చిన ఎన్టీఆర్ వీరాభిమాని

admin1
Updated on: 6 March 2022 7:01 PM IST
Jr NTR Fan Buy 75 Movie Tickets in Dallas | Telugu Movie News
X

75 టికెట్లు కొన్న ఎన్టీఆర్ ఫ్యాన్

Jr NTR Fan: కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమాలు అన్నీ ఇప్పుడు ఒకదాని తర్వాత మరొకటి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. "రాధేశ్యామ్" సినిమా మార్చి 11న విడుదల కాబోతుండగా మరోవైపు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ బడ్జెట్ సినిమా "ఆర్.ఆర్.ఆర్" మార్చ్ 25 థియేటర్లలో విడుదల కాబోతుంది. ఒకే నెలలో రెండు ప్యాన్ ఇండియన్ సినిమాలు విడుదల కాబోతుండంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే తాజాగా ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అమెరికాలో "ఆర్ఆర్ఆర్" అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక ఎన్టీఆర్ వీరాభిమాని ఓకే సారి 75 టికెట్లు కొనుగోలు చేసి అందరిని అందరికీ షాకిచ్చాడు. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో గెలాక్సీ స్పేస్ థియేటర్ లో 24వ తారీకున 12:30 షో కి ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు 75 టికెట్లు కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరియు హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story