Evaru Meelo Koteeswarulu 2021: 'ఎవరు మీలో కోటీశ్వరులు' వాయిదా?

Evaru Meelo Koteeswarulu 2021: "ఎవరు మీలో కోటీశ్వరులు" షోతో ఎన్టీఆర్ బుల్లి తెరపైకి మరలా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Venkata Chari
Published on: 15 April 2021 5:45 PM IST
Evaru Meelo Koteeswarulu 2021
X

ఎన్టీఆర్ (ఫొటో: ది హన్స్ ఇండియా)

Evaru Meelo Koteeswarulu 2021: హిందీ గేమ్ షో "కౌన్ బనేగా క్రోరోపతి" (కేబీసీ) తెలుగు వెర్షన్ "ఎవరు మీలో కోటీశ్వరులు" షోతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బుల్లి తెరపైకి మరలా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ తో కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మే నెలలో ప్రారంభించాల్సిన ఎన్టీఆర్ "ఎవరు మీలో కోటీశ్వరులు" జూన్ వరకు వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వెలువడున్నాయి. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం విడుదల కాలేదు. గతంలో ఈషోకు నాగార్జున, చిరంజీవి హోస్ట్ గా చేశారు. నాలుగు సీజన్లు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే అత్యధిక టీఆర్‌పీని సాధించాయి.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" తో బిజీగా ఉన్నాడు. ఇందులో రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈఏడాది అక్టోబర్ 13 న "ఆర్ఆర్ఆర్" విడుదల కానుంది.

Venkata Chari

Venkata Chari

Next Story