హ‌రికృ‌ష్ణ జ‌యంతి : ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ ట్వీట్

Arun Chilukuri
Published on: 2 Sept 2020 3:02 PM IST
హ‌రికృ‌ష్ణ జ‌యంతి : ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ ట్వీట్
X

Nandamuri Harikrishna: నేడు దివంగ‌త న‌టుడు నంద‌మూరి హ‌రికృ‌ష్ణ 64వ జ‌యంతి. ఈ సందర్భంగా ఆయన తనయుడు టాలీవుడ్ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ తండ్రిని తలచుకొని భావొద్వేగానికి లోనయ్యారు. హరికృష్ణ 64వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ.. మిస్‌ యు నాన్న అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. తన అన్న నందమూరి కల్యాణ్‌రామ్‌తో పాటు తాను తన తండ్రిని స్మరించుకుంటున్నానని చెప్పాడు. ట్విట‌ర్ వేదిక‌గా తండ్రికి నివాళులు అర్పించారు.

"ఈ అస్థిత్వం మీరు. ఈ వ్య‌క్తిత్వం మీరు. మొక్క‌వోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్ర‌స్థానానికి నేతృత్వం మీరు. ఆజ‌న్మాంతం త‌లుచుకునే అశ్రుక‌ణం మీరే - నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, నంద‌మూరి తార‌క రామారావు" అంటూ మ‌న‌సులోని భావాల‌ను వ్య‌క్తీక‌రించారు. నటుడుగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల్లో చెరగని ముద్రవేశారు నంద‌మూరి హ‌రికృష్ణ‌. చైత‌న్య‌ర‌ధ‌సార‌ధిగా, సౌమ్యుడిగా అంద‌రి హృద‌యాల‌లో శాశ్వ‌త స్థానాన్ని సంపాదించుకున్న హ‌రికృష్ణ 2018 ఆగస్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story