RRR Movie Sequel: ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌పై స్పందించిన ఎన్టీఆర్‌

RRR Movie Sequel: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా "ఆర్ ఆర్ ఆర్" గురించి డిస్కషన్ లు నడుస్తున్నాయి.

Arun Chilukuri
Updated on: 9 April 2022 7:51 AM IST
Jr NTR Breaks Silence on RRR Movie Sequel
X

RRR Movie Sequel: ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌పై స్పందించిన ఎన్టీఆర్‌

RRR Movie Sequel: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా "ఆర్ ఆర్ ఆర్" గురించి డిస్కషన్ లు నడుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించిన సినిమా "ఆర్ ఆర్ ఆర్". రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చ్ 25 న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్‌ వెయ్యి కోట్ల క్లబ్బులోకి చేరగా చిత్రయూనిట్‌ సక్సెస్‌ పార్టీ చేసుకుంది. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ ఎప్పుడన్న ప్రశ్న తరచూ ప్రేక్షకుల నుంచి వారికి ఎదురవుతూ ఉంది. తాజాగా దీనిపై తారక్‌ సరదాగా స్పందించాడు. చాలామంది ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ కావాలని అడుగుతున్నారు. మాక్కూడా సెకండ్‌ పార్ట్‌ తీస్తే బాగుంటుందని అనిపిస్తోంది.

రాజమౌళి కనక సీక్వెల్‌ తీయకపోతే మీరందరూ ఆయన్ని చంపేసేలా ఉన్నారు. ఆయన కచ్చితంగా రెండో పార్ట్‌ తీస్తారని ఆశిద్దాం' అని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు. ఆలియా భట్ మరియు ఓలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. డీ వి వి ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story