Jr NTR: హీరోయిన్‌గా కీయారా అద్వానీ వైపే కొరటాల చూపు?

Jr NTR As Student Leader in Koratal Movie
x

ఎన్టీఆర్‌, కీయారా అద్వానీ (ఫొటో ట్విట్టర్)

Highlights

జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత కొరటాలతో ఓ సినిమా చేయనున్నాడు.

Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. జనతా గ్యారేజ్‌ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రెండో సినిమాగా రానుంది. దీంతో ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది. కొరటాల ప్రస్తుతం చిరంజీవి హీరోగా 'ఆచార్య' మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌తో సినిమా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ కథ తిరుగుతుందని, పొలిటికల్‌ టచ్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ తో రొమాన్స్ చేసేది ఎవరో ఖరారైనట్లు తెలుస్తోంది.

పాన్‌ ఇండియాగా రానున్న ఈ మూవీలో కీయారా అద్వానీ లేదా రష్మికను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు సమాచారం. కాగా, 'భరత్ అనే నేను' సినిమాలో కొరటాల శివ హీరోయిన్‌గా కీయారాను తీసుకున్నాడు. ఆ సినిమా భారీ హిట్ కొట్టింది. దీంతో మరోసారి కియారానే ఎన్టీఆర్ సినిమాలో తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories