NTR: రిటైర్డ్ అథ్లెట్‌గా జూనియర్ ఎన్‌టీఆర్?

Junior NTR as a Retired Athlete?
x

బూచి బాబు సన, ఎన్టీఆర్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ "ఆర్ఆర్ఆర్" తో బిజీగా ఉన్నారు.

NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ "ఆర్ఆర్ఆర్" తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అయిపోగానే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త చిత్రానికి పని చేస్తాడు. అయితే ఈ మధ్యలో బుచి బాబు సనా దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సైన్ చేశాడని తెలిసిందే. ఉప్పెన తరువాత, బుచి బాబు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్‌తో మరో చిత్రానికి సంతకం చేశారు.

నివేదిక ప్రకారం, ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో ఒక ప్రయోగాన్ని చేయాలని దర్శకుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ దాదాపు పూర్తి కావొస్తుందని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా మెయిన్ పాయింట్ ఎన్టీఆర్ ఇప్పటికే ఇష్టపడ్డారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ 60 ఏళ్ల రిటైర్డ్ అథ్లెట్గా కనిపిస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా దంగల్ తరహాలో ఉంటుందని మరికొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. బుచ్చి బాబు, ఎన్టీఆర్ కాంబోలో రానున్న ఈ ప్రాజెక్టు పై అప్పుడే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ బుచి బాబుపై చాలా నమ్మకంతో ఈ కథను ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories