RRR Movie: ఉక్రెయిన్ వీధుల్లో కారులో షికారు చేసిన రామ్ చరణ్, తారక్

RRR Movie: సినిమాను ప్రమోషన్ చేసుకోవాడంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తర్వాతనే ఇంకేవరైనా.. ఏ సినిమాకైనా తనదైన స్టైయిల్‌లో పబ్లిసిటీ చేసుకుంటాడు.

Arun Chilukuri
Published on: 11 Aug 2021 7:46 PM IST
Jr NTR and Ram Charan Groove to Dosti Song From RRR
X

RRR Movie: ఉక్రెయిన్ వీధుల్లో కారులో షికారు చేసిన రామ్ చరణ్, తారక్

RRR Movie: సినిమాను ప్రమోషన్ చేసుకోవడంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తర్వాతనే ఇంకేవరైనా ఏ సినిమాకైనా తనదైన స్టైయిల్‌లో పబ్లిసిటీ చేసుకుంటాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌ త్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్‌ను ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాడు రాజమౌళి. అందుకోసం కొత్త కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తూ ఫ్యాన్స్ క్యూరియాసిటీ పెంచుతున్నాడు.

ఉక్రెయిన్ వీధుల్లో మెగాపవర్ స్టార్‌ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారులో షికారు చేశారు. ఇటీవల రిలీజ్ అయిన దోస్తీ పాటకు హమ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని త్రిపుల్ ఆర్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబీనేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న త్రిపుల్ ఆర్ మూవీని దసరా కానుకగా విడుదల చేయనున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story