కుప్పంలో ఎన్టీఆర్‌, చరణ్‌ ఫ్యాన్స్ మధ్య రచ్చ.. ఇరువర్గాల మధ్య ఘర్షణ..

RRR Movie: చిత్తూరు జిల్లా కుప్పంలో ట్రిపుల్ ఆర్ సినిమా జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపుతోంది.

Arun Chilukuri
Updated on: 24 March 2022 8:48 PM IST
Jr NTR and Ram Charan Fans Fight in Kuppam
X

కుప్పంలో ఎన్టీఆర్‌, చరణ్‌ ఫ్యాన్స్ మధ్య రచ్చ

RRR Movie: చిత్తూరు జిల్లా కుప్పంలో ట్రిపుల్ ఆర్ సినిమా జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపుతోంది. టిక్కెట్ల రేట్ల విషయంలో రెండు వర్గాల అభిమానుల మధ్య రగడ మొదలైంది. ఫ్యాన్స్ షో టికెట్లపై ఓ హీరో అభిమాన సంఘం నేతల పేర్లను ముద్రించడంతో వివాదం మొదలైంది. థియేటర్ ఎదుటే ఫ్యాన్స్ షో టికెట్లను అభిమానులు చించేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కుప్పంలోని మూడు థియేటర్లలో మూడు బెనిఫిట్ షోలకు సంబంధించి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫోటోలతో 3వేల టికెట్లు అభిమానులు ముద్రించారు. వెంటనే టికెట్లపై ముద్రించిన పేర్లు, ఫోన్‌ నెంబర్లను తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story