Jr NTR: సూపర్ హిట్ కాంబోలో మరో సినిమా?

Jr NTR and Rajamouli to join hands once again
x
రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ (ఫొటో హన్స్ ఇండియా)
Highlights

Jr NTR: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పనిచేస్తున్నారు.

Jr NTR: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టూడెంట్ నెం: 1, సింహాద్రి, యమ దొంగ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా నాల్గవది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో మరొక ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి, ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను పూర్తి చేసిన తరువాత... త్రివిక్రమ్‌ తో జతకట్టనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, అట్లీ తో రెండు ప్రాజెక్టులు చేయనున్నారు. మొదట ఎవరి సినిమాలో నటిస్తాడో తెలియదు.

మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రాజమౌళి.. మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా తీయనున్నారు. మహేష్ సినిమా పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా టైం పట్టొచ్చు. కానీ ఇది తారక్ అభిమానులకు నిజంగా ఓ సంతోకరమైన న్యూస్.

Show Full Article
Print Article
Next Story
More Stories