సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఎన్టీఆర్ ప్రణతి ల ఫోటో

సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఎన్టీఆర్ ప్రణతి ల ఫోటో
x
Highlights

నందమూరి నట వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నే తెలుగు తెరకు పరిచయమైన ఎన్టీఆర్ 2001లో 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి...

నందమూరి నట వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నే తెలుగు తెరకు పరిచయమైన ఎన్టీఆర్ 2001లో 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిపోయారు. తన కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న సమయంలో లక్ష్మీ ప్రణతిని పెళ్ళి చేసుకున్నారు. ఈ మధ్యనే లక్ష్మి ప్రణతి తన పుట్టినరోజు జరుపుకోగా, నందమూరి వారి ఇంట పెద్ద పార్టీ జరిగింది.

నందమూరి కుటుంబ సభ్యులు, కొందరు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలలో పాలు పంచుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి ల నిశ్చితార్థం ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం ఫోటో కాబట్టి ఇద్దరూ చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. నందమూరి అభిమానులు ఈ ఫోటోను విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 2011 మేలో పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి లకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల పరంగా ఈ మధ్యనే 'అరవింద సమేత' సినిమాతో హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్' అనే హై బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories