ఇంకా పట్టాలెక్కని ఎన్టీఆర్ కొరటాల సినిమా

ఇంకా పట్టాలెక్కని ఎన్టీఆర్ కొరటాల సినిమా

admin1
Updated on: 2 March 2022 10:01 PM IST
Jr NTR and Director Koratala Siva Combination Movie
X

ఇంకా పట్టాలెక్కని ఎన్టీఆర్ కొరటాల సినిమా

Jr NTR-Koratala Siva: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్" సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈనెల 25 వ తారీకున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యనే "భరత్ అనే నేను" సినిమా తో బ్లాక్ బస్టర్ అందించిన కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ చాలాసార్లు చేంజ్ చేస్తూ ఉండడంతో సినిమా షూటింగ్ కి ఎక్కువ సమయం పట్టింది.

పైగా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ ఆ సమయంలో "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ తో బిజీ అవడంతో "ఆచార్య" సినిమా షూటింగ్ కూడా ఆలస్యం అయింది. నిజానికి కొరటాల శివ తో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడో పట్టలెక్కాల్సింది. 2018లో అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ అదే సంవత్సరంలో భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివతో సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వారి సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అంతేకాకుండా 2018 తర్వాత వారిద్దరిదీ ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం యాదృచ్చికం అనే చెప్పాలి.

admin1

admin1

Next Story