Jr NTR-Buchi Babu: త్వరలో పట్టాలు ఎక్కనున్నా ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమా

Jr NTR-Buchi Babu: త్వరలో పట్టాలు ఎక్కనున్నా ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమా

admin1
Published on: 26 Jan 2022 8:33 AM IST
Jr NTR Acting With Director Buchi Babu Movie | Tollywood Movie
X

త్వరలో పట్టాలు ఎక్కనున్నా ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమా

Jr NTR-Buchi Babu: "ఉప్పెన" సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన బుచ్చిబాబు సనా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో రెండవ సినిమాతోనే ఎన్టీఆర్తో సినిమా చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు బుచ్చిబాబు. అయితే మరోవైపు ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో బుచ్చిబాబు ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ తోనే బిజీగా ఉన్న ఎన్టిఆర్ మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత అట్లీ తో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నారు ఆ తరువాత మాత్రమే బుచ్చి బాబు ఉండబోతోంది.

కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ అట్లీ సినిమా ని వెనక్కి వేసినట్లు తెలుస్తోంది. అంటే కొరటాల శివ తో సినిమా పూర్తవగానే ఎన్టీఆర్ బుచ్చిబాబు తో ఒక సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి ఎన్టీఆర్ తో పాటు బన్నీకి కూడా ఒక కథ చెప్పే ఉంచాడు అట్లీ ఎవరు ముందుగా ఓకే చేస్తే వాళ్ళతో సినిమా చేద్దామని అనుకున్నాడు. దీంతో బన్నీ తో ప్రాజెక్టు తో బిజీ అయిపోయాడు అట్లీ. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు మరియు ఎన్టీఆర్ సినిమాకి లైన్ క్లియర్ అయింది. అయితే ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఒక స్పోర్ట్స్ సినిమాని ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియన్ రేంజిలో ఉండబోతోందని సమాచారం.

admin1

admin1

Next Story