Jr NTR - Ram Charan: "రామ్ చరణ్ తో నా స్నేహం అప్పుడే మొదలైంది" అంటున్న ఎన్టీఆర్

Jr NTR - Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య స్నేహం ఇప్పటిది కాదు...

admin1
Updated on: 16 March 2022 8:01 PM IST
Jr NTR about Friendship with Ram Charan | Jr NTR Latest News
X

Jr NTR - Ram Charan: "రామ్ చరణ్ తో నా స్నేహం అప్పుడే మొదలైంది" అంటున్న ఎన్టీఆర్

Jr NTR - Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య స్నేహం ఇప్పటిది కాదు. బయట ప్రపంచానికి వీరిద్దరూ స్టార్ హీరోలు కానీ దాని కంటే ముందు వారు ఇద్దరూ మంచి స్నేహితులు. నందమూరి మరియు మెగా కుటుంబానికి కూడా మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా "ఆర్ఆర్ఆర్" పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ చిత్రం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీరిద్దరూ తమ స్నేహం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారిద్దరి మధ్య స్నేహం ఎప్పుడు ఎలా మొదలైందో చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. "మేము ఇద్దరం భిన్నధృవాలు. భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయి అనేది మా విషయంలో నిజమైంది. ఒక అగ్ని పర్వతం బద్దలవుతున్నా సరే రామ్ చరణ్ చాలా కామ్ గా ఉంటాడు. ఒకసారి స్టార్ క్రికెట్ పోటీలు జరుగుతున్నప్పుడు నేను చరణ్ కలిసి వెళ్ళాం.

అక్కడ మాట్లాడుకున్నాం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఎవరికీ తెలియకుండా ఒక బలమైన స్నేహం మా మధ్య ఏర్పడింది. మార్చి 26న న భార్య ప్రణతి పుట్టిన రోజు, 27 న రామ్ చరణ్ ది. 26న 12గంటలు దాటిన వెంటనే చరణ్ కారు మా గేటు దగ్గరికి వస్తుంది. నేను రామ్ చరణ్ తో వెళ్ళిపోతాను. మా ఆవిడ ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడిగినా 26 అయిపోయింది గా అంటాను. పాపం ఎప్పుడైనా గేట్ దగ్గర ప్రణతి ఉంటుందేమోనని చరణ్ భయపడుతూ ఉంటాడు" అని చెప్పుకొచ్చారు తారక్.

admin1

admin1

Next Story