Hollywood heroine Dies From Breast Cancer: క్యాన్సర్‌తో మరో నటి కన్నుమూత

Hollywood heroine Dies From Breast Cancer: హాలీవుడ్ లో విషాదం నెలకొంది. క్యాన్సర్‌ మహమ్మారి కారణంగా నటి కెల్లీ ప్రెస్టన్ (57) మరణించారు. రెండేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్య ఆదివారం మరణించినట్లు ట్రావోల్టా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Raj
By Raj
Updated on: 13 July 2020 2:26 PM IST
Hollywood heroine Dies From Breast Cancer: క్యాన్సర్‌తో మరో నటి కన్నుమూత
X
John Travolta dies with breast cancer: kelly preston actor wife john travolta dies aged 57 breast cancer

Hollywood heroine Died From Breast Cancer: హాలీవుడ్ లో విషాదం నెలకొంది. క్యాన్సర్‌ మహమ్మారి కారణంగా నటి కెల్లీ ప్రెస్టన్ (57) మరణించారు. రెండేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్య ఆదివారం మరణించినట్లు ట్రావోల్టా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు అందులో ఇలా పేర్కొన్నారు. "నా అందమైన భార్య కెల్లీ రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతూ రెండేళ్ల యుద్ధంలో ఓడిపోయిందని నేను మీకు తెలియజేస్తున్నాను" అని ట్రావోల్టా పేర్కొన్నారు. "ఆమె చాలా మంది ప్రేమ మరియు మద్దతుతో సాహసోపేతమైన పోరాటం చేసింది." అని పేర్కొన్నారు.

ప్రెస్టన్ పలు హాలీవుడ్ చలనచిత్రాల తోపాటు పలు టెలివిజన్‌ కార్యక్రమాల్లో సుదీర్ఘమైన నటనా అనుభవం సంపాదించారు. తన భర్తతో కలిసి కూడా కొన్ని చిత్రాలలో నటించారు.ప్రెస్టన్ 1999 లో 'ఫర్ ది లవ్ ఆఫ్ ది గేమ్' లో కెవిన్ కాస్ట్నర్ సరసన నటించారు. 2004 లో మెరూన్ 5 'షీ విల్ బి లవ్డ్' కోసం ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించారు. ఆమె నటించిన చివరి చిత్రం గొట్టి (2018). ఇక ఆమెకు కుమార్తెఎల్లా (20), కుమారుడు బెంజమిన్‌ (9) ఉన్నారు. 2009 లో జెట్‌(16) అనే కుమారుడిని కోల్పోయారు కెల్లీ, జాన్‌ దంపతులు. కాగా స్పేస్‌క్యాంప్ (1986), జెర్రీ మాగైర్ (1996) ఫర్ లవ్ ఆఫ్ ది గేమ్ (1999) వంటి ప్రముఖ చిత్రాలలో కెల్లీ ప్రెస్టన్ నటించారు.


Raj

Raj

Next Story