'జెర్సీ' క్లైమాక్స్ విషయంలో తీరని కన్ఫ్యూజన్

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి రెండు డిజాస్టర్ లని చవిచూసిన నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన ఆశలన్నీ తన...
'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి రెండు డిజాస్టర్ లని చవిచూసిన నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా 'జెర్సీ' పైనే పెట్టుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక క్రికెటర్ ఎమోషనల్ జర్నీ గా తెరకెక్కనున్న ఈ చిత్ర క్లైమాక్స్ కోసం రెండు వెర్షన్ లు షూట్ చేశారని, ఒకటి హ్యాపీ ఎండింగ్ మరొకటి ట్రాజిక్ ఎండింగ్ అని పలువురి అభిప్రాయాలు తీసుకుని ఏదో ఒకదాన్ని ఫైనలైజ్ చేస్తారని ఇప్పటికే పుకార్లు బయటకు వచ్చాయి. హీరో చనిపోతే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారు అనేది కేవలం థియరీ మాత్రమే కానీ ఇది ప్రాక్టికల్గా వర్కవుట్ అయిన సందర్భాలు తెలుగులో చాలా అరుదు.
గతంలో నాని నటించిన స్పోర్ట్స్ సినిమా 'భీమిలి కబడ్డీ జట్టు' లో కూడా కూడా నాని పాత్ర చనిపోతుంది. ఆ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తప్పును నాని ఇందులో కూడా చేస్తాడా అనేది ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్లో కి నెట్టేస్తోంది. పైగా ఇప్పటికే విడుదలైన పాటలలో అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం కేవలం ఆవరేజ్ అని మాత్రమే ప్రేక్షకులు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ సమయంలో 'జెర్సీ' సినిమాకు ట్రాజిక్ ఎండింగ్ పెట్టటం అసలు మంచి ఆలోచన కాదని కొందరి అభిప్రాయం. మరి క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఏప్రిల్ 19 వరకు వెయిట్ చేయాల్సిందే.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMTధైర్యం కంటే భయం గొప్పది అంటున్న కొరటాల శివ
21 May 2022 6:55 AM GMTసమీపిస్తున్న వినాయ చవితి వేడుకలు.. నిమజ్జనం ఎక్కడ..?
21 May 2022 6:26 AM GMT