క్లీన్ 'యూ' సర్టిఫికేట్ తో బయటకు వచ్చిన నాని సినిమా

క్లీన్ యూ సర్టిఫికేట్ తో బయటకు వచ్చిన నాని సినిమా
x
Highlights

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి డిజాస్టర్ లను చవిచూసిన న్యాచురల్ స్టార్ నాని ఈసారి ఎలాగైనా తన తదుపరి సినిమా 'జెర్సీ' తో హిట్ అందుకోవాలని...

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి డిజాస్టర్ లను చవిచూసిన న్యాచురల్ స్టార్ నాని ఈసారి ఎలాగైనా తన తదుపరి సినిమా 'జెర్సీ' తో హిట్ అందుకోవాలని ఆశిస్తున్నాడు. 'మళ్ళీరావా' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం లో నాని క్రికెటర్ అవతారంలో కనిపించబోతున్నాడు. కన్నడ బ్యూటీ శ్రద్ద శ్రీనాద్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అంతేకాక సినిమాపై అంచనాలను కూడా భారీగా పెంచాయని చెప్పుకోవచ్చు.

ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని కూడా చాలా బాగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. క్లీన్ 'యూ' సర్టిఫికేట్ తో 'జెర్సీ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదివరకు నాని నటించిన స్పోర్ట్స్ సినిమా 'భీమిలి కబడ్డీ జట్టు' ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరి ఈ సినిమాతో నాని ఎంత వరకు హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories